ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం స్పెషల్ సెట్..

by Naga Rani Yarlagadda |

పాన్-ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘స్పిరిట్’.

ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం స్పెషల్ సెట్..
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్-ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒక పవర్‌ఫుల్ కాప్ డ్రామాగా రాబోతోంది. ప్రభాస్ ఈ సినిమాలో ఒక IPS ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. తాజా అప్‌డేట్స్ ప్రకారం.. ప్రభాస్ మొదటి షెడ్యూల్‌ని వైరప్ చేసి, త్రిప్తి డిమ్రితో కలిసి జైల్ సీక్వెన్సెస్, కాన్వర్జేషన్ సీన్స్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ విమెన్స్ కాలేజ్‌లో నైట్ షూట్స్ జరిగాయి. ఇప్పుడు టీమ్ మెక్సికోకు ట్రావెల్ అవుతోంది. అక్కడ కీలక యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేయబోతున్నారు. కొత్త షెడ్యూల్‌లో స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్ పై ప్రభాస్ ఎంట్రీ సాంగ్ షూట్ అవుతుంది. దీనికోసం స్పెషల్ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్‌లో ప్రభాస్‌తో పాటు హీరోయిన్ కూడా కీ పార్ట్ ప్లే చేస్తుందని సమాచారం. ఈ సాంగ్ పూర్తయిన తర్వాత.. సినిమా మొత్తానికి మెయిన్ హైలైట్ అయ్యే భారీ యాక్షన్ సీక్వెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఇండోనేషియాలోని జకార్తాలో కూడా కొన్ని పోలీస్ యాక్షన్ షెడ్యూల్స్ ఉండవచ్చని రిపోర్ట్స్ సూచిస్తున్నాయి.

స్పిరిట్ మ్యూజిక్ విషయంలో.. కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్‌తో సందీప్ రెడ్డి మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేశారు. 70% బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే రెడీ అయింది. ఇది ‘యానిమల్’లా ఇంటెన్స్ టోన్ సెట్ చేస్తుంది. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం, మెక్సికోలో డ్రగ్ కార్టెల్స్‌తో కనెక్ట్ అయిన ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్‌తో ఫైట్ చేసే కాప్ స్టోరీ. ఈ సినిమా పూర్తిగా ఫ్రెష్‌గా, వినూత్నంగా ఉంటుందని మేకర్స్ హైప్ చేస్తున్నారు. సంక్రాం ప్రభాస్ ఈ పాత్ర కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటూ, లీన్ లుక్ సెట్ చేసుకున్నాడు. ఈ చిత్రం ‘కల్కి 2898 AD’ తర్వాత ప్రభాస్‌కి మరో మాస్ ఎంటర్‌టైనర్ అవుతుందని అంచనా.

Next Story