- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఓదెల-2’ నుంచి స్పెషల్ పోస్టర్.. శివలింగానికి అభిషేకం చేస్తున్న స్టార్ బ్యూటీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా(Tamannah) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓదెల-2’(Odela-2).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా(Tamannah) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓదెల-2’(Odela-2). అశోక్ తేజ(Ashok Teja) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. సంపత్ నంది(Sampath Nandi) కథ అందించడంతో పాటు రచయితగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇందులో హెబ్బా పటేల్(Hebah Patel), వశిష్ట ఎన్ సింహ(Vasishta N Simha) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ‘ఓదెల రైల్వేై స్టేషన్’(Odela Railway Station)కు సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీలో తమన్నా నాగసాధువుగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 17న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. నేడు శ్రీరామ నవమి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఓదెల-2 నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక పోస్టర్‌లో తమన్నా నాగ సాధువు గెటప్‌లో శివలింగానికి కలశంతో వాటర్‌తో అభిషేకం చేస్తుంది. అలాగే ఇంకా మూవీ రిలీజ్ కావడానికి 11 రోజులు మాత్రమే సమయం ఉందని బంతిపూలతో తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.






