- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సౌత్ వాళ్లు తిండి అయినా మానేస్తారు కానీ ఆ పని చేయడం మాత్రం మానరు’.. రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో నటించి మంచి స్టార్‌డమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా తమన్నా, రాశిఖన్నాలు కలిసి ‘అరుణ్మణై-4’ అనే సినిమాలో నటించి మంచి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో పాటు తెలుగులో సిద్దు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ అనే మూవీతో పాటు, తమిళంలో ‘అగాథియా’ అనే పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. ఈ క్రమంలో ఈ భామ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా అక్కడ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘సౌత్‌లో సినిమా అభిమానులు ఎక్కవ అక్కడ హీరోలని దేవుళ్లుగా కొలుస్తారు. మూవీ రిలీజ్ అయినప్పుడు పండుగలా భావిస్తారు. అందుకే దక్షిణాదిలో ప్రేక్షకులు తిండి అయినా మానేస్తారేమో కానీ సినిమాలు చూడటం మాత్రం ఆపరు. అదే నార్త్‌లో ప్రజలు సినిమాలు పక్కన పెట్టి మిగతా వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ తర్వాత సినిమాలు చూస్తారు’ అని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






