సౌత్ ఇండియాను షేక్ చేస్తున్న తెలుగు సినిమా.. టాప్ 5లో నాలుగు మనవే

by Pulgam srinivas |   (  Updated:2026-03-04 16:52:49  IST  )

విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సాంగ్స్ ఇవే

సౌత్ ఇండియాను షేక్ చేస్తున్న తెలుగు సినిమా.. టాప్ 5లో నాలుగు మనవే
X

దిశ, వెబ్ డెస్క్ : సౌత్ ఇండియన్ సినిమాలలో తెలుగు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. సౌత్లో 1000 కోట్ల వసూళ్లను రాబట్టిన చిత్రాలలో ఎక్కువ శాతం తెలుగు సినిమాలే ఉన్నాయి. మరికొన్ని విషయాలలో కూడా తెలుగు సినిమా పరిశ్రమ చాలా ముందు వరుసలో ఉంది. ఇక విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ను సాధించిన లిరికల్ వీడియో సాంగ్స్ విషయంలో కూడా తెలుగు పరిశ్రమ చాలా ముందు వరుసలో ఉంది. విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 లిరికల్ సాంగ్లలో నాలుగు తెలుగు సినిమా సాంగ్స్ ఉండడం విశేషం... అవేంటో తెలుసుకుందాం.

రై రై రా రా (పెద్ది)

రామ్ చరణ్ హీరోగా, జాన్వి కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలోని ఈ పాటకు 24 గంటల్లో 29.22 మిలియన్ వ్యూస్ దక్కాయి.

చికిరి చికిరి (పెద్ది)

పెద్ది మూవీలోని ఈ సాంగ్కు 24 గంటల్లో 29.19 మిలియన్ వ్యూస్ దక్కాయి.

దేఖ్ లేంగే సాలా (ఉస్తాద్ భగత్ సింగ్)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, రాశి ఖన్నా, శ్రీ లీల హీరోయిన్లుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ఈ లిరికల్ వీడియోకు రిలీజ్ అయిన 24 గంటల్లో 28.53 మిలియన్ వ్యూస్ దక్కాయి.

కిస్సిక్ (పుష్ప 2)

అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలోని ఈ లిరికల్ వీడియోకు 24 గంటల్లో 27.19 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

విజిల్ పోడు (గోట్)

తలపతి విజయ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలోని ఈ సాంగ్కు 24 గంటల్లో 24.88 మిలియన్ వ్యూస్ దక్కాయి.

Next Story