ఆ హీరో అంటే ఇష్టం... ఒకేసారి 10 సినిమాలకు హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ?

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సౌందర్య (soundarya ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో సౌందర్య సినిమాలు

ఆ హీరో అంటే ఇష్టం... ఒకేసారి 10 సినిమాలకు హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సౌందర్య (soundarya ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో సౌందర్య సినిమాలు వచ్చాయంటే ఎగబడి చూసేవారు జనాలు. ఆమె ఎలాంటి అందచందాలు ఆరబోయకుండా... సింపుల్ గా చీర కట్టి స్టెప్పులు వేసిన జనాలు చూసేవాళ్ళు. అంతలా పాపులారిటీ దక్కించుకుంది హీరోయిన్ సౌందర్య. అదృష్టం బాగాలేక మరణించింది కానీ... అప్పట్లో హీరోయిన్ గా సౌందర్య ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు.

ఇప్పటికి కూడా చాలా మంది సౌందర్యను తలుచుకుంటూ.. ఆమె చేసిన సినిమాలను చూస్తూ తెలుగు ప్రజలు నిద్రపోతారు. అయితే అలాంటి హీరోయిన్ సౌందర్యకు.. తెలుగు హీరో జగపతిబాబు అంటే చాలా ఇష్టమట. ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో సౌందర్య కు చాలా హెల్ప్ చేశారట జగపతిబాబు (Jagapathi Babu). అందుకే ఆయనంటే గౌరవంతో కూడిన ఇష్టమట. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో దాదాపు పది సినిమాలకు పైగా వచ్చాయి.

ఆ సినిమాలన్నీ కూడా విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఉందని కూడా జోరుగా అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అంతలోపే హీరోయిన్ సౌందర్య హెలికెప్టర్ ప్రమాదం జరిగి మరణించిన సంగతి తెలిసిందే. 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. భారతీయ జనతా పార్టీ ( BJP) తరఫున తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు సౌందర్య. ఆ సమయంలోనే బెంగళూరు నుంచి కరీంనగర్ వెళ్లే నేపథ్యంలో.. ప్రమాదం జరిగి మరణించారు. ఈ ప్రమాదంలో సౌందర్య తో పాటు ఆమె సోదరుడు కూడా మరణించాడు.

Next Story