- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sonu Sood: గూస్ బంప్స్ తెప్పిస్తోన్న సోనూ సూద్ ‘ఫతే’ టీజర్
స్టార్ హీరో సోనూసూద్(Sonu Sood) పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.

దిశ, సినిమా: స్టార్ హీరో సోనూసూద్(Sonu Sood) పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఆయన విభిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కరోనా(Corona) సమయంలో సోనూసూద్ ప్రజలకు సేవలు చేసి ప్రపంచవ్యాప్తంగా రియల్ హీరో అనిపించుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రజెంట్ ఆయన దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫతే’(Fateh). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ విడుదల కాలేదు.
తాజాగా, ఈ మూవీ టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో యాక్షన్ సన్ని వేశాల్లో అదిరిపోయే ఫెర్ఫారెన్మ్స్తో సోనూసూద్ గూస్ బంప్స్ తెప్పించారు. ప్రజెంట్ ఈ టీజర్ ‘ఫతే’ మూవీపై అంచనాలను పెంచుతోంది. అయితే ఈ సినిమాలో సోనూ సూద్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez), విజయ్ రాజ్, సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా(Naseeruddin Shah) ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాను జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సోనాలి సూద్ (Sonali Sood), ఉమేష్ కేఆర్ బన్సాల్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.






