- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sonu Sood: అరెస్ట్ వారెంట్‌పై స్పందించిన రియల్ హీరో.. టార్గెట్ చేయడం చాలా బాధాకరమంటూ సెన్సేషనల్ పోస్ట్

దిశ, సినిమా: స్టార్ హీరో సోనూసూద్(Sonu Sood) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టర్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక కరోనా టైంలో ఎంతో మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పటికీ ఎవరికీ ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ కష్టం కంటే ముందే ఉంటున్నాడు. తనకు తోచినంత సాయం చేస్తున్నాడు. ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ఇతని ఫొటోని పెట్టుకుని దేవుడిలా పూజిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అలాగే ఓ స్వచ్ఛంద సంస్థను కూడా రన్ చేస్తూ ప్రజలకు సాయం చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. రియల్ హీరో సోనుసూద్‌కు నేడు అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్‌లోని లుథియానా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఈ విషయంపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ సంచలన పోస్ట్ పెట్టాడు. ‘సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్న వార్తలపై సంచలనాత్మకమైన విషయాలను సృష్టం చేయాలి.
విషయం సూటిగా చెప్పాలంటే నాకు ఎటువంటి సంబంధం లేని అంశం విషయంలో కోర్టు నన్ను సాక్షిగా పిలిచింది. మా న్యాయవాదులు కోర్టుకు సమాధానమిచ్చారు. ఫిబ్రవరి 10న దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాను. నా ప్రమేయం లేని విషయాలను మీ అందరికీ సృష్టంగా వివరిస్తాను. ఆ కేసుకు, నాకు ఏ విధమైన సంబంధం లేదు. దీనిపై మీడియా అనవసరంగా దృష్టి సారిస్తోంది. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం చాలా బాధాకరం’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది.