- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంటిచేత్తో పామును పట్టిన సోనూసూద్ !
నటుడు సోనుసూద్ (Sonu sood) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో చాలా సినిమాల్లో విలన్ గా నటించి అందరినీ

దిశ, వెబ్ డెస్క్ : నటుడు సోనుసూద్ (Sonu sood) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో చాలా సినిమాల్లో విలన్ గా నటించి అందరినీ అలరించాడు సోను సూద్. సినిమాల్లోనే కాకుండా... సామాజిక కార్యక్రమాలు చేయడంలో కూడా సోనుసూద్ ముందంజలో ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నామని... అనగానే వెంటనే అక్కడ వాలిపోతాడు ఈ బాలీవుడ్ నటుడు సోను సూద్. ముఖ్యంగా కరోనా సమయంలో చాలామందికి ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నాడు.
దీంతో అప్పటి నుంచి రియల్ హీరో గా మారిపోయాడు సోను సూద్. అదే సమయంలో ప్రత్యేకంగా ఓ ఫౌండేషన్ పెట్టి చాలామందిని ఆదుకుంటున్నాడు. అయితే అలాంటి నటుడు సోను సూద్....తాజాగా ఓ పామును ( Snake) పట్టుకొని కనిపించాడు. ముంబైలో తాను నివసించే సొసైటీలోకి వచ్చిన ఓ పామును... ఒంటి చేత్తో పట్టుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. అనంతరం సంచిలో వేసాడు సోనూసూద్.
అంతేకాదు ఆ పామును ర్యాట్ స్నేక్ అని... అది పెద్ద విషపూరితము కాదని కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే పాముల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. ఇళ్లల్లోకి పాములు ప్రవేశించినప్పుడు నిపుణులు అయిన వారిని పిలవాలని.. వాళ్లు ఆ పాములను తీసుకువెళ్తారని తెలిపాడు. అయితే పామును పట్టుకున్న సోను సూద్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఆయన ఫ్యాన్స్... ఫిదా అయిపోతున్నారు.






