ఆర్సీబీని టార్గెట్ చేస్తూ ప్రముఖ సింగర్ వరుస పోస్టులు.. ఈ దరిద్రం అంతటికీ కారణం వాళ్లే

by Sujitha Rachapalli |

ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ ఆర్సీబీని టార్గెట్ చేశాడు. కర్ణాటకలో కన్సర్ట్ జరిగనప్పటి నుంచి హర్ట్ అయిన ఆయన.. కన్నడ ప్రజలకు వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు. ఆర్సీబీ(RCB) కప్పు కొట్టిన తర్వాత నుంచి

ఆర్సీబీని టార్గెట్ చేస్తూ ప్రముఖ సింగర్ వరుస పోస్టులు.. ఈ దరిద్రం అంతటికీ కారణం వాళ్లే
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ ఆర్సీబీని టార్గెట్ చేశాడు. కర్ణాటకలో కన్సర్ట్ జరిగనప్పటి నుంచి హర్ట్ అయిన ఆయన.. కన్నడ ప్రజలకు వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు. ఆర్సీబీ(RCB) కప్పు కొట్టిన తర్వాత నుంచి మరింత ఎక్కువగానే ప్రొవోక్ చేస్తున్నాడు. ప్రపంచంలో జరుగుతున్న దరిద్రాలన్నింటికి కారణం ఆర్సీబీ కప్ గెలవడమే అన్నట్లుగా లేటెస్ట్ పోస్ట్ పెట్టాడు. ఈ ట్వీట్ కాస్త లేట్‌గా వైరల్ అయిన పొట్టు పొట్టు వేసుకుంటున్నారు నెటిజన్లు.

కన్సర్ట్‌లో కన్నడ పాటలు పాడమంటే హర్ట్ అయిన నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావని తెలుసని బూతులు తిడుతున్నారు. నిజానికి నువ్వు ఎప్పుడైతే సింగర్ అయ్యావో అప్పటి నుంచే ప్రపంచం నాశనమైపోతుందని.. ఇలాంటి ట్వీట్స్ పెట్టి మరింత పరువు తీసుకునే పనులు చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. మజాక్ మజాక్ అంటూ ఎమోషనల్ డ్యామేజ్ చేశావంటే ఊరుకోమంటున్నారు. అయితే సోను నిగమ్‌కు అస్సలు ట్విట్టర్ ఎకౌంట్ లేదని.. కావాలనే తన పేరుతో ఇలాంటి ట్వీట్స్ వేస్తున్నారని ఫైర్ అవుతున్నారు ఇంకొందరు. దీంతో అదే ట్విట్టర్ ఎకౌంట్ నుంచి మరో పోస్ట్ పెట్టిన వ్యక్తి.. ‘ఈ ఎకౌంట్ ఫేక్ అనుకుంటున్న ప్రతి ఒక్కరికి నా సానుభూతి ప్రకటిస్తున్నాను. ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్. గెట్ వెల్ సూన్ గాయ్స్’ అంటూ ముగించాడు.

TWEET

Next Story