Srivishnu: ఇంకెంత కాలం బాధ, కోపం, ద్వేషం అంటూ హీరో పోస్ట్..

by Chukka Sudharani |   (  Updated:2025-04-17 13:40:26  IST  )

హీరో శ్రీవిష్ణు (Srivishnu), డైరెక్టర్ కార్తీక్ రాజు (Karthik Raju) కాంబినేషనల్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’

Srivishnu: ఇంకెంత కాలం బాధ, కోపం, ద్వేషం అంటూ హీరో పోస్ట్..
X

దిశ, సినిమా: హీరో శ్రీవిష్ణు (Srivishnu), డైరెక్టర్ కార్తీక్ రాజు (Karthik Raju) కాంబినేషనల్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ (Single). నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీస్ ఇవానా, కేతిక శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌ (Summer Special)గా మే నెలలో థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్న ఈ మూవీలో వెన్నెల కిశోర్ (Vennela Kishore) కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ‘సిర్రాకైంది సింగిల్ బతుకు’ (SirrakaindhiSingleBathuku) సాంగ్ రిలీజ్ చేశారు. ‘బాధ, కోపం, ఈర్ష్య, కసి, ద్వేషం! మన సింగిల్ కష్టాలు ఇంకెన్నెన్నో... అలాంటి సింగిల్స్ కోసం ఫ్రస్టేషన్ ఆంతమ్.. ‘సిర్రాకైంది సింగిల్ బతుకు’’అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్ చేతులో బీర్ బాటిల్స్ ఉండగా.. మధ్యలో లేడీ బొమ్మ ఉంటుంది. ప్రజెంట్ ఈ సాంగ్‌తో పాటు పోస్ట్ కూడా నెట్టింట ఆకట్టుకుంటోంది.

Next Story