- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Raj Tarun: ‘జాను మెరిజాను’ అంటున్న రాజ్ తరుణ్.. వైరల్‌గా పోస్టర్
యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

దిశ, సినిమా: యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక మొదటి సినిమాతో మంచి విజయం అందుకున్న ఈ హీరో.. తర్వాత వరుస ఆఫర్లు అందుకున్నాడు. అంతే కాకుండా.. వరుసగా హిట్స్ సొంతం చేసుకోవడంతో టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోయాడు. అయితే.. గత కొంతకాలంగా వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నప్పటికీ సినిమాల్లో మాత్రం జోరు తగ్గించలేదు. గతేడాది ఏకంగా.. ‘నా సామి రంగ, పురుషోత్తముడు, తిరగబడరా సామి, భలే ఉన్నాడే’ వంటి చిత్రాలు చేసి ఆకట్టుకున్నాడు.
ఈ క్రమంలో త్వరలో ‘పాంచ్‌మినార్’ (Paanch Minar) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. రామ్ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్‌పై మాధవి, ఎమ్ఎస్ఎమ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఈ సినిమా నుంచి ‘జానుమెరిజాను’ (JanuMeriJanu) లిరికల్ వీడియో రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
#JanuMeriJanu Lyrical Video from #PaanchMinar releasing Tomorrow at 4:05 PM @itsrajtarun @RashiReal_ pic.twitter.com/FbT0K5tURZ
— Vamsi Kaka (@vamsikaka) May 2, 2025






