- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నొదిలి కలనోదిలిని అంటున్న అల్లరి నరేష్..
అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ ‘12A రైల్వే కాలనీ’.

దిశ, సినిమా: అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ ‘12A రైల్వే కాలనీ’. నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రంతో నూతన దర్శకుడు నాని కాసరగడ్డ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఇక రిలీజ్ సమయం దగ్గరపడుతున్న క్రమంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన మేకర్స్.. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ‘12A రైల్వే కాలనీ’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘కన్నోదిలి కలనోదిలిని’ విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ట్రాక్ లవ్ ఫీలింగ్‌ని అందంగా హైలైట్ చేస్తుంది. కాగా.. ఇప్పటికే ఇందులో నుంచి విడుదలైన టీజర్‌లు సినిమాపై అంచనాలు పెంచగా.. ఈ సినిమాతో అల్లరి నరేష్ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తాడో అని క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. కాగా.. ఈ చిత్రంలో డాక్టర్ కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.






