- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sonali Bendre: ఆ స్టార్ హీరో నాకెంతో సపోర్ట్‌గా నిలిచారు.. సీనియర్ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఒకప్పుడు తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుని స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది సోనాలి బింద్రే.

దిశ, సినిమా: ఒకప్పుడు తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుని స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది సోనాలి బింద్రే. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లో తల్లైనా ఈమె.. కొంత కాలం వెండితెరకు దూరం అయ్యింది. తర్వాత మళ్లీ టీవీ షోల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తన కెరీర్ స్టార్ట్ అయింది అనుకున్న క్రమంలోనే 2018లో సోనాలి క్యాన్సర్ బారిన పడింది. అప్పుడు అమెరికాలోని న్యూయార్క్ వెళ్లి చికిత్స తీసుకుని.. మనో ధైర్యంతో క్యాన్సర్ మహమ్మారిని జయించింది. ఇప్పుడు మళ్లీ తన కెరీర్‌ను స్టార్ట్ చేయాలని చూస్తున్న సోనాలి బింద్రే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చికిత్స తీసుకున్నప్పటి అనుభవాలను పంచుకుంది.
‘బిడ్డ తర్వాత నా కెరీర్‌ను మళ్లీ స్టార్ట్ చేయ్యాలని ప్లాన్ చేసుకుని.. టీవీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. కరెక్ట్‌గా అదే సమయంలో నాకు క్యాన్సర్ నిర్ధారణ అయింది. దీంతో కెరీర్‌కు మళ్లీ బ్రేక్ పడింది. ఆ క్షణాలు నా జీవితంలో చాలా బాధాకరమైనవి. అయితే.. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలో సల్మాన్ ఖాన్ నాకెంతో దైర్యాన్ని ఇచ్చారు. న్యూయార్క్‌లో నా చికిత్స ఎలా సాగుతుంది అని నా ఆరోగ్యంపై ప్రతి రోజు ఆరా తీసేవారు. ఆ సమయంలో ఆయనదైర్యాన్ని ఇవ్వడంతో పాటు.. రెండు, మూడు సార్లు న్యూయార్క్ వచ్చి నన్ను సరామర్శించారు. ఇతరుల మాటలు కూడా మనకు మెడిసిన్‌లా పరి చేస్తాయి అనే దానికి సల్మాన్ ఖాన్ నిదర్శనం. ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని’ అని తెలిపిందే. ప్రజెంట్ సోనాలి కామెంట్స్ వైరల్ అవుతుండగా.. మీరు ఎప్పటికీ అంతే దైర్యంగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






