Sonali Bendre: సోనాలి బింద్రేపై రైతు కేసు..ల్యాండ్ క‌బ్జా చేశారంటూ !

by velandi.Saikiran |

సోనాలి బింద్రే, ఆమె భర్త గోల్డి బెహల్ తన 30 గుంటల భూమిని ఆక్రమించాడని పూణే ప్రాంతానికి చెందిన చంద్రకాంత్ కేసు పెట్టాడు.

Sonali Bendre: సోనాలి బింద్రేపై రైతు కేసు..ల్యాండ్ క‌బ్జా చేశారంటూ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అలనాటి టాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే ( Sonali Bendre ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ అందాల తార సోనాలి బింద్రే, తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఇలాంటి సోనాలి బింద్రే, ఆమె భర్త గోల్డి బెహల్ తన 30 గుంటల భూమిని ఆక్రమించాడని పూణే ప్రాంతానికి చెందిన చంద్రకాంత్ అనే రైతు కేసు పెట్టాడు. తాజాగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి, సోనాలి బింద్రే ఫ్యామిలీపై ఫిర్యాదు చేశాడు.

కోర్టులో తేల్చుకుంటా - సోనాలి బింద్రే

ఈ భూమి 1957 నుంచి వంశ పారంపర్యంగా వస్తోందని పేర్కొన్న రైతు చంద్రకాంత్, తనను బెదిరించి భూమిని ఆక్రమించారని ఆరోపణలు చేశారు. అయితే ఈ భూమి వివాదంపై సోనాలి బింద్రే కూడా రియాక్ట్ అయ్యారు. తాను చట్ట బద్ధంగానే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు సోనాలి బింద్రే స్పష్టం చేస్తున్నారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలా కొంత మంది కుట్రలు పన్నుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ భూమిపై కోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. తాను ఎవరిని మోసం చేయలేదని.. న్యాయ బద్ధంగానే భూమిని సొంతం చేసుకున్నట్లు తెలిపారు. దీంతో సోనాలి బింద్రే వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Next Story