పదహారు నెలలుగా కడుపుతో ఉన్నా.. నాది వరల్డ్ రికార్డ్.. హీరోయిన్ సంచలన పోస్ట్

by Sujitha Rachapalli |

బ్యూటిఫుల్ సోనాక్షి సిన్హా మొత్తానికి జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకుంది. ఫ్యామిలీ వ్యతిరేకించినా.. రిలీజియన్ వేరు అయినా.. ప్రేమ పెళ్లి చేసుకుని శభాష్ అనిపించుకుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదుర్స్ అనిపిస్తుంది. ఇన్‌స్టా పోస్టులు, పబ్లిక్ అప్పియరెన్స్‌లోనూ చాలా

పదహారు నెలలుగా కడుపుతో ఉన్నా.. నాది వరల్డ్ రికార్డ్.. హీరోయిన్ సంచలన పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : బ్యూటిఫుల్ సోనాక్షి సిన్హా మొత్తానికి జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకుంది. ఫ్యామిలీ వ్యతిరేకించినా.. రిలీజియన్ వేరు అయినా.. ప్రేమ పెళ్లి చేసుకుని శభాష్ అనిపించుకుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదుర్స్ అనిపిస్తుంది. ఇన్‌స్టా పోస్టులు, పబ్లిక్ అప్పియరెన్స్‌లోనూ చాలా ఫన్నీగా కనిపించే వీరికి పెళ్లి అయినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్‌గా దివాళీ పార్టీకి అటెండ్ అయిన టైమ్‌లో.. సోనాక్షి పొట్ట చుట్టూ చేతులు వేసి.. ప్రెగ్నెంట్ అనేలాగా కామెడీ చేశాడు. ఇక ఫైనల్‌గా ఈ విషయాన్ని సీరియస్‌గానే చర్చించేందుకు నిర్ణయించుకున్న సోనాక్షి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చింది. ‘హ్యూమన్ హిస్టరీలో వరల్డ్ రికార్డ్ నాదే. పదహారు నెలలుగా ప్రెగ్నెంట్‌గా ఉన్నా. జస్ట్ మిడ్ సెక్షన్ చుట్టూ చేతులు వేసి ఫొటో దిగడం వల్ల ఇదంతా జరిగింది’ అంటూ ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు చెక్ పెట్టింది.

Next Story