- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమలో పడిన అబ్బాయిలందరూ దాచుకునే విషయం.. ‘ఇట్లు అర్జున’ ఫస్ట్ సింగిల్ అప్డేట్
‘ఇట్లు అర్జున’ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదలకు చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసింది. ‘హాయ్ రే’ అని సాగే ఒక బ్యూటిఫుల్ సాంగ్‌ను మే 28న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దిశ, సినిమా: టాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల ఇప్పుడు నిర్మాతగా ఒక సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన తన సొంత నిర్మాణ సంస్థ వాట్ నెక్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమా ద్వారా అనీష్ హీరోగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. అలాగే మలయాళ ముద్దుగుమ్మ, స్టార్ నటి అనస్వర రాజన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘ఇట్లు అర్జున’ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదలకు చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసింది. ‘హాయ్ రే’ అని సాగే ఒక బ్యూటిఫుల్ సాంగ్‌ను మే 28న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ క్రేజీ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ.. "ప్రేమలో పడిన ప్రతి అబ్బాయి తనలో దాచుకునే ఆ చిన్న 'ఓహ్ మై!' భావన.. ఇప్పుడు ఒక పాట రూపంలో మన ముందుకు రాబోతోంది" అంటూ ఇచ్చిన క్యాప్షన్ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ లైన్ చూస్తుంటే ఇదొక ఫ్రెష్ ఫీల్ గుడ్ లవ్ సాంగ్ అని స్పష్టమవుతోందిపాట ప్రకటనతో పాటు విడుదల చేసిన అఫీషియల్ పోస్టర్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. ఈ క్లాసిక్ పోస్టర్‌లో హీరోయిన్ అనస్వర రాజన్ కిటికీ విండో పై కూర్చొని ఎంతో శ్రద్ధగా బుక్ చదువుకుంటూ కనిపిస్తుండగా.. ఆమె కింద కూర్చున్న హీరో అనీష్ ఆమెను చూస్తూ ఎంతో మురిపోతూ, నవ్వుతూ కనిపించాడు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ ఎంతో సహజంగా మరియు రిఫ్రెషింగ్‌గా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.






