హరిహర వీరమల్లు నుంచి ఆ సీన్లు డిలీట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-28 09:28:37  IST  )

హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) పార్ట్-1.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ఈ పాన్ ఇండియా సినిమా జులై 24వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైంది.

హరిహర వీరమల్లు నుంచి ఆ సీన్లు డిలీట్
X

దిశ, వెబ్‌డెస్క్: హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) పార్ట్-1.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ఈ పాన్ ఇండియా సినిమా జులై 24వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైంది. తొలి మూడ్రోజుల్లో దేశవ్యాప్తంగా వీరమల్లుకు రూ.75 కోట్ల వసూళ్లు (HHVM Collections) వచ్చినట్లు సమాచారం. కాగా.. సినిమా ప్రీమియర్స్ నుంచీ ఒకటే టాక్ వినిపించింది. ఫస్టాఫ్ బాగుంది అని. అలాగే వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు రియాలిటీకి దగ్గరగా లేకపోవడంతో ఆకట్టుకోలేకపోయాయని ఆడియన్స్ తమ రివ్యూలను చెప్పారు. సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ జరుగుతోంది.

దీంతో మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా నుంచి కొన్ని సీన్లను తొలగించింది. హీరో, అతని అనుచరులు కొండ అంచున గుర్రాలపై స్వారీ చేసే సీన్ నిడివిని కుదించారు. జెండా సీన్ ను తొలగించిన టీమ్, పవన్ బాణాలను సంధించే యాక్షన్ సీన్ లో చిన్న చిన్న మార్పులు చేశారు. క్లైమాక్స్ సమయాన్ని కూడా తగ్గించారు. మొత్తంగా సినిమా నిడివిలో 10-15 నిమిషాల ఫుటేజీని తొలగించారు. కాగా.. సినిమాలో సీన్లను తొలగించడంపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read..

WAR 2 వర్రీ.. ఇక బీటౌన్ లో తుస్సేనా..?

Next Story