- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nikhil Siddharth: కొందరు సరదాగా చేసే పని వల్ల ప్రాణాలు పోతున్నాయి జాగ్రత్త.. టాలీవుడ్ హీరో ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddharth) ఇటీవల ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’(Appudo Ippudo Eppudo) సినిమాతో ప్రేక్షకులను అలరించారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddharth) ఇటీవల ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’(Appudo Ippudo Eppudo) సినిమాతో ప్రేక్షకులను అలరించారు. కానీ హిట్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం ‘స్వయంభూ’(Swayambhu) చిత్రంలో నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి(Bharat Krishnamachari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్(Samyuktha Menon), నభా నటేష్(Nabha Natesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, నిఖిల్ నెటిజన్లు ఓ సలహా ఇచ్చారు.
వ్యూస్ రాబట్టడం కోసం తప్పుడు వార్తలు షేర్ చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎక్స్‌పయిరీ డేట్ చూసుకుని జాగ్రత్తగా కొంటుంటాయు. కానీ సోషల్ మీడియా(Social Media)లో ఏదైనా న్యూస్ షేర్ చేసేటప్పుడు మాత్రం అది నిజమా కాదా అని తెలుసుకోకుండా ఏమవుతుంది అని ఇతరులకు షేర్ చేస్తాం.
ఇలా సరదాగా షేర్ చేసిన ఫేక్ న్యూస్‌ల(Fake news) కారణంగా ఒక్కోసారి ఇతరులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇతరులకు ఏదైనా న్యూస్ షేర్ చేసేముందు ఒకసారి చెక్ చేసుకుని నిజమా కాదా అని తెలుసుకుని షేర్ చేయాలి. ఒక నుంచి సోషల్ మీడియాను పదిమందికి ఉపయోగపడేలా వాడుదాం. ఇబ్బంది పెట్టేలా కాదు’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నిఖిల్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు మంచి మాట చెప్పారని పొగుడుతున్నారు.
. @actor_nikhil urges us to make social media a platform for spreading positivity and encouragement!
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 30, 2024
❌ Say NO to fake news and abusive behavior#PostNoEvil #CheduPostCheyavaddu #PledgeToPostNoEvil pic.twitter.com/O59Cdyx8qD






