కొన్ని ప్రయాణాలు జీవితాలనే మారుస్తాయి.. ‘హ్యాపీ జర్నీ’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ, ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది.

కొన్ని ప్రయాణాలు జీవితాలనే మారుస్తాయి.. ‘హ్యాపీ జర్నీ’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ వెబ్ సిరీస్‌ల ద్వారా ఫుల్ ఫేమ్ రాబట్టుకుని ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చింది. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, తరగతి గది దాటి, చౌర్యపాఠం, ప్రసన్న వదనం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది. ఇక ఇటీవల ‘పాపం ప్రతాప్’ మూవీతో తన అందం, నటనతో అందరినీ మంత్రముగ్దులను చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాయల్‌కు తెలుగులో మరో చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో పాయల్‌తో పాటు ఆమని, యాంకర్ ఘాన్సీ, రూప శ్రీనివాస్, జినిష అలీశెట్టి, సునైనా,పృథ్వీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ, ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. ఇక ఈ సినిమా గురించి మేకర్స్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి హృదయాలకు హత్తుకునే ఒక అద్భుతమైన కథను, నటీనటుల అసాధారణమైన నటనతో కలిపి మీ సమీపంలోని థియేటర్లలోకి తీసుకురావడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. నవ్వులు, కుటుంబ భావోద్వేగాలు, ఎప్పటికీ మరపురాని ఎన్నో మంచి జ్ఞాపకాలతో నిండిన ఈ సినిమా ప్రయాణంలో త్వరలోనే ప్రేక్షకులను కలుస్తామని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా వ్యక్తం చేసింది. ఇక విడుదలైన పోస్టర్‌లో ‘‘కొన్ని ప్రయాణాలు ప్రణాళికలను మారుస్తాయి.. కొన్ని జీవితాలను మారుస్తాయి’’ అనే క్యాప్షన్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. 'పాపం ప్రతాప్' సక్సెస్ తర్వాత పాయల్ రాధాకృష్ణ నటిస్తున్నమూవీ కావడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

Next Story