- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajinikanth: రజినీకాంత్ జైలర్-2 పై సాలిడ్ అప్‌డేట్.. ప్రోమో వచ్చేది అప్పుడే!
సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) ఇటీవల ‘వేట్టయన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) ఇటీవల ‘వేట్టయన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. టీ.జె. జ్ఞానవేల్ (T.J. Gnanavel) దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత ఫలితాన్ని దక్కించుకోలేక పోయింది. ఇక ప్రజెంట్ ఆయన ‘కూలీ’ చిత్రంతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) కాంబోలో తెరకెక్కిన ‘జైలర్’ (jailer) చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. 2023లో వచ్చిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సినీ క్రిటిక్ మనోబాల విజయ్ బాలన్ తన సోషల్ మీడియా అకౌంట్ ‘X’ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ‘జైలర్ పార్ట్ 2 ప్రోమో షూట్ డిసెంబర్ 5న స్టార్ట్ కాబోతుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ పుట్టినరోజున ప్రోమో విడుదలయ్యే అవకాశం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






