- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రామాయణ’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఫుల్ ఖుషీలో సినీ ప్రియులు
కన్నడ స్టార్ హీరో యశ్(Yash) ‘కేజీఎఫ్’ సినిమాలో రాఖీ భాయ్‌గా నటించి తిరుగులేని అభిమానులను సొంతం చేసుకున్నారు.

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో యశ్(Yash) ‘కేజీఎఫ్’ సినిమాలో రాఖీ భాయ్‌గా నటించి తిరుగులేని అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘కేజీఎఫ్-2’ మూవీ హిట్ కావడంతో అందరి దృష్టి యశ్‌పై పడింది. ఇక ఆయన తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో.. యశ్ ‘టాక్సిక్’(Toxic) సినిమాతో రాబోతున్నట్లు ప్రకటించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కాబోతుంది.
ఇక యశ్ ఈ సినిమాతో పాటు నితీష్ తివారీ(Nitish Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’(Ramayana) చిత్రంలో యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా అతని స్నేహితుడితో కలిసి నిర్మిస్తున్నారు. ఇక రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో సాయి పల్లవి(Sai Pallavi), రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) జంటగా కనిపిస్తున్నారు. మొదటి పార్ట్ వచ్చే ఏడాది దీపావళి కానుకగా థియేటర్స్‌లోకి రాబోతున్న ఈ మూవీలో బాబీడియోల్ హనుమంతుడిగా నటిస్తున్నాడు. అయితే ఫస్ట్ పార్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వారంలో యశ్ ‘రామాయణ’ షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. రావణుడికి ప్రాణం పోసేందుకు యష్ సిద్ధంగా ఉన్నాడు! రాకింగ్ స్టార్ ఉజ్జయినిలో ఆలయ సందర్శనతో ఈ పురాణ ప్రయాణాన్ని ప్రారంభించినట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఆయన పాత్ర గురించి పలు విషయాలను చర్చించుకుంటున్నారు.






