- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలో భారీ రెస్పాన్స్ అందుకుంటున్న ‘సోదర సోదరిమానులారా..!’ మూవీ
సోషల్ డ్రామా - థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ‘సోదర సోదరిమానులారా..!’ చిత్రం తాజాగా ‘ఆహా’ ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ను అందుకుంటోంది. దర్శకుడు రఘుపతి రెడ్డి గుండా

దిశ, సినిమా : సోషల్ డ్రామా - థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ‘సోదర సోదరిమానులారా..!’ చిత్రం తాజాగా ‘ఆహా’ ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ను అందుకుంటోంది. దర్శకుడు రఘుపతి రెడ్డి గుండా తెరకెక్కించిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, పృథిరీరాజ్, అపర్ణ, కలకేయ ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఒక సాధారణ మనిషి జీవితం ఒక్క సంఘటనతో ఎలా పూర్తిగా తలకిందులవుతుందో గాఢంగా ఆవిష్కరిస్తుంది. కథ ఒక క్యాబ్ డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. భార్య, ఆరు సంవత్సరాల కూతురితో సంతోషంగా జీవిస్తున్న అతని జీవితంలో అకస్మాత్తుగా వచ్చిన మలుపు అతడిని తీవ్ర విషాదంలోకి నెట్టేస్తుంది. ఒక అత్యాచారం, హత్య కేసులో అతడిని తప్పుగా నిందితుడిగా నిలబెట్టి శిక్ష విధించడంతో అతని గౌరవం, స్వేచ్ఛ, కుటుంబ జీవితం అన్నీ ఛిద్రమవుతాయి.
ఈ నేపథ్యంలో నిజాన్ని నిరూపించుకునేందుకు అతడు చేసే పోరాటం, అలాగే భర్త నిర్దోషిత్వాన్ని నిలబెట్టేందుకు అతని భార్య వ్యవస్థతో, సమాజపు ముద్రలతో చేసే ధైర్యమైన పోరాటం చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయి. ఒక మహిళ తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో ఎదుర్కొనే మానసిక, సామాజిక సంఘర్షణను దర్శకుడు హృదయాన్ని తాకేలా చిత్రీకరించారు. కమల్ కామరాజు, పృథిరీరాజ్, అపర్ణ, కలకేయ ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించి తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో వారి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.






