- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా పెరిగిన విష్ణుప్రియ ఆదాయం.. లక్షా, రెండు లక్షలు కాదు!
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ విష్ణుప్రియ చుట్టూ ముసురుకున్న వివాదాలు, పోలీస్ కేసులు ఆమె ఆర్థిక స్థితిని మాత్రం అమాంతం పెంచినట్లు కనిపిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ విష్ణుప్రియ చుట్టూ ముసురుకున్న వివాదాలు, పోలీస్ కేసులు ఆమె ఆర్థిక స్థితిని మాత్రం అమాంతం పెంచినట్లు కనిపిస్తోంది. సాధారణంగా వివాదాలు కెరీర్‌పై దెబ్బకొడతాయని అనుకుంటారు, కానీ విష్ణుప్రియ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. వివాదం మొదలైన తర్వాత ఆమె పెయిడ్ సబ్‌స్క్రైబర్ల (Paid Subscribers) సంఖ్య భారీగా పెరగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విష్ణుప్రియపై వివాదం రేగడానికి ముందు వరకు ఆమెకు దాదాపు 1,892 మంది పెయిడ్ సబ్‌స్క్రైబర్లు ఉండేవారు. ఒక్కో సబ్‌స్క్రిప్షన్ విలువ రూ.380 చొప్పున లెక్కిస్తే.. ఆమెకు నెలకు సుమారుగా రూ.7 లక్షల వరకు ఆదాయం వచ్చేది. అప్పట్లో ఆమె ఫాలోయింగ్ ఒక మోస్తరుగా ఉండేది. అయితే, ఎప్పుడైతే ఆమెపై కేసులు నమోదై, సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగిందో.. అప్పటి నుంచి ఆమె కంటెంట్ చూడటానికి నెటిజన్లు క్యూ కట్టారు. తాజా గణాంకాల ప్రకారం.. విష్ణుప్రియ పెయిడ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1,892 నుండి ఏకంగా 4,832కి చేరుకుంది.
పెరిగిన ఆదాయం..
సబ్‌స్క్రైబర్లు పెరగడంతో ఆమె ఆదాయం కూడా మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఆమె నెలకు రూ.18 లక్షల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. నెగటివ్ పబ్లిసిటీ కూడా కొన్నిసార్లు కమర్షియల్‌గా ఎలా వర్కవుట్ అవుతుందనే దానికి విష్ణుప్రియ ఒక ఉదాహరణగా నిలుస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.






