- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sobhita Dhulipala: చీరలో.. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో నడుము అందాలు హైలైట్
చీరలో.. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో నడుము అందాలు హైలైట్ చేస్తూ రెచ్చిపోయినశోభిత ధూళిపాళ

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగ చైతన్య భార్యగా, అలాగే నటిగా శోభిత ధూళిపాళ గుర్తింపును సంపాదించుకుంది. మోడలింగ్ రంగం నుండి కెరీర్‌ను ప్రారంభించిన ఈమె, తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీ పొందింది.
తెలుగులో ఈ బ్యూటీ గూఢచారి, మేజర్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రెండు చిత్రాల్లో కూడా అడవి శేష్ హీరోగా నటించడం విశేషం. నాగచైతన్య ఇటీవల ‘తండెల్’ అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది, అలాగే ఇందులోని తన నటనతో చైతూ మంచి ప్రశంసలను కూడా అందుకున్నాడు.
ఈ చిత్రంలోని ఆయన నటనకు తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డు కూడా దక్కింది. ఈ అవార్డు వేడుకకు నాగచైతన్యతో పాటు శోభిత కూడా హాజరైంది. ఈ సందర్భంగా ఆమె ట్రాన్స్‌పరెంట్ నెట్ ఫ్యాబ్రిక్‌తో ఉన్న సిల్వర్-గ్రే టోన్ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో స్టైలిష్‌గా మెరిసింది. ఈ లుక్‌లో ఆమె చాలా గ్లామరస్‌గా కనిపించడంతో ఆ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతేకాకుండా, ఈ ఫోటోలను శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేయగా, పలువురు సెలబ్రిటీలు కూడా వీటిపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ నటి రాశి ఖన్నా ఫైర్ ఎమోజీతో కామెంట్ చేయడం హైలైట్ అయింది. అయితే, తాజా ఫోటోలలో ఆమెకు హెయిర్ చాలా తక్కువగా ఉండటంతో, “జుట్టు కాస్త ఎక్కువగా ఉంటే ఇంకా బాగుండేది” అంటూ కొందరు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
పెళ్లికి ముందు శోభిత తరచుగా గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేది. కానీ ఇటీవల అలాంటి పోస్టులు చాలా తగ్గాయి. అయితే తాజాగా ఈ నటి షేర్ చేసిన ఈ ఫోటోలు మాత్రం మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Photos Courtesy: Instagram






