‘రాకాస’ నుంచి ‘స్నేక్ డ్యాన్స్’.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిహారిక డ్యాన్స్

by Chukka Sudharani |

‘రాకాస’ నుంచి ‘స్నేక్ డ్యాన్స్’ సాంగ్ రిలీజ్ అయింది.

‘రాకాస’ నుంచి ‘స్నేక్ డ్యాన్స్’.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిహారిక డ్యాన్స్
X

దిశ, సినిమా: నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రెండో చిత్రంగా ‘రాకాస’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ని చిత్రయూనిట్ ప్రారంభించింది. ఇప్పటి వరకు ‘రపప్పా’, ‘పదే పదే’ పాటల్ని మేకర్లు రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ‘స్నేక్ డ్యాన్స్’ అనే పాటను విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్‌ని చూస్తుంటే ఇదొక ప్రమోషనల్ గీతంగా కనిపిస్తోంది. గ్యాంగ్ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఈ పాటను కంపోజ్ చేశారు. ‘స్నేక్ డ్యాన్స్’ పాటలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, సంగీత్ శోభన్, నయన్ సారిక తమ స్టైల్లో దుమ్ములేపేశారు. ఇక చివర్లో మెగా ప్రొడ్యూసర్ నిహారిక వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి.

Next Story