- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Prabhas : చిన్న మిస్టేక్.. ప్రభాస్ చేస్తున్న రెండు సినిమాలపై ఎఫెక్ట్ చూపిందా?
స్పిరిట్ మూవీ బృందం ఈ నెలలో ఒక షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కానీ అది రద్దు కావడంతో, దాని ప్రభావం 'కల్కి 2' తదుపరి షెడ్యూల్‌పై పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, అలాగే నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో కల్కి 2 చిత్రాలు చేస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం ఈ మూడు చిత్రాల షూటింగ్‌లను ఏకకాలంలో పూర్తి చేస్తూ వస్తున్నాడు. దాంతో ప్రస్తుతం ఈ నటుడు అత్యంత బిజీగా తన కాలాన్ని గడుపుతున్నాడు. ఇక తాజాగా స్పిరిట్ సినిమా విషయంలో జరిగిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ‘కల్కి 2’పై కాస్త ప్రభావం పడినట్లు తెలుస్తోంది. స్పిరిట్ మూవీ బృందం ఈ నెలలో ఒక భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది.
కానీ కొన్ని కారణాల వల్ల ఆ షెడ్యూల్ రద్దు అయింది. దాంతో ప్రభాస్ యూరప్‌కు వెకేషన్‌కు వెళ్లినట్లు సమాచారం. తిరిగి వచ్చాక మే నెలలో స్పిరిట్ మూవీ బృందం కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా అనుకున్న సమయానికి ఈ మూవీ షెడ్యూల్ పూర్తి కాకపోవడంతో 'కల్కి 2' తదుపరి షెడ్యూల్‌లో కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 మూడు చిత్రాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






