సరికొత్త ప్రేమకథతో ‘స్కై’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

by Sujitha Rachapalli |

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా "స్కై". పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు.

సరికొత్త ప్రేమకథతో ‘స్కై’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్
X

దిశ, సినిమా : మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్‌టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా ‘స్కై’. పృథ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్న సినిమా ద్వారా శివ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఫిబ్రవరి 6న మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు మేకర్స్ ఈ సందర్భంగా మాట్లాడిన ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గుంటక.. ‘‘స్కై’ సినిమాను మేమంతా ఎంతో కష్టపడి ప్రొడ్యూస్ చేశాం. టీమ్ అందరూ ప్యాషనేట్‌గా వర్క్ చేశారు. హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉన్న ఒక కొత్త ప్రేమ కథను మా మూవీలో మీరంతా చూడబోతున్నారు. ఫిబ్రవరి 6న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’ అని తెలిపారు.

Next Story