- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jailer 2: రజినీకాంత్ జైలర్-2 సెట్స్‌లో స్టార్ నటుడు.. పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చెయ్యి బ్రో అంటున్న ఫ్యాన్స్
‘కూలీ’తో హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం జైలర్-2పై తన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.

దిశ, సినిమా: ‘కూలీ’తో హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం జైలర్-2పై తన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. రజినీకాంత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన ‘జైలర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ హై వోల్టెడ్ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఇందులో వసంత్ రవి, యోగిబాబు, మీర్నా మీనన్, వినాయకన్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్‌తో పాటు ఎస్‌జే సూర్య కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్‌లోకి సూర్య ఎంట్రీ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. జైలర్-2లోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రికరిస్తుండగా.. ఇందులో సూర్య భాగం అయినట్లు టాక్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అకావడంతో.. సూర్య అన్నకు సంబంధించిన ఓ పవర్ ఫుల్ లుక్ రిలీజ్ చెయ్యి అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. లింక్






