Vishal: కోలీవుడ్ ఇండస్ట్రీలో సిక్స్ ప్యాక్ వివాదం.. హాట్ టాపిక్‌గా మారిన విశాల్ కామెంట్స్! (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-25 12:19:50  IST  )

సోషల్ మీడియా మొత్తం గత రెండు రోజుల నుంచి పహల్గాం ఉగ్రదాడి గురించి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Vishal: కోలీవుడ్ ఇండస్ట్రీలో సిక్స్ ప్యాక్ వివాదం.. హాట్ టాపిక్‌గా మారిన విశాల్ కామెంట్స్! (వీడియో)
X

దిశ, సినిమా: సోషల్ మీడియా మొత్తం గత రెండు రోజుల నుంచి పహల్గాం ఉగ్రదాడి గురించి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 28 మంది మృతి చెందడంతో యావత్ భారతీయులంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. కోలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త వివాదం మొదలైంది. సిక్స్ ప్యాక్ మాకే ఉందంటూ మాకు ఉందని తమిళ స్టార్స్ కామెంట్లు చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే కోలీవుడ్ హీరో సూర్య(Suriya) నటిస్తున్న ‘రెట్రో’(Retro) ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన తండ్రి శివకుమార్(Shivakumar) చేసిన కామెంట్లు చర్చకు దారితీశాయి. సిక్స్ ప్యాక్స్ ట్రెండ్‌ను ప్రవేశపెట్టింది నా కొడుకే అని చెప్పడంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న వారంతా పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా, ఈ వివాదం గురించి విశాల్ (Vishal)స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సూర్య తండ్రి కామెంట్స్ గురించి యాంకర్ చెప్పగా ఆయన పగలబడి నవ్వేశారు. ‘‘కోలీవుడ్ ఇండస్ట్రీలో తొలిసారి సిక్స్ ప్యాక్ బాడీ ట్రై చేసింది ధనుష్. వెట్రిమారన్ తెరకెక్కించిన ‘పొల్లాధవర్’ సినిమా కోసం ఆయన ఆరు పలకల దేహంతో కనిపించాడు. ఆ తర్వాత నేను 2008లో వచ్చిన ‘సత్యం’ మూవీ కోసం సిక్స్ ప్యాక్ చేశా. ‘మదగజరాజ’లోనూ అదే లుక్‌లో కనిపించాను.

ఆ విషయాలను వాళ్లు మర్చిపోయి ఉండొచ్చు. అయితే మరో నాలుగు నెలల్లో నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తి అవుతుంది. కార్తి దగ్గరుండి నిర్మాణపనులు చూసుకుంటున్నాడు’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సూర్య అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక కొంతమంది మాత్రం ధనుష్‌ది కూడా సిక్స్ ప్యాక్ బాడీనా అని అంటున్నారు. విశాల్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ వివాదం ఇంకా ముదిరేలా కనిపిస్తోంది.

Next Story