పవన్ కల్యాణ్‌కు పోటీగా రిలీజ్‌కు సిద్ధమైన మరో స్టార్ హీరో మూవీ.. ‘OG’ పోస్ట్‌పోన్ అవుతుందిలే అంటున్న నెటిజన్లు

by sudharani |
పవన్ కల్యాణ్‌కు పోటీగా రిలీజ్‌కు సిద్ధమైన మరో స్టార్ హీరో మూవీ.. ‘OG’ పోస్ట్‌పోన్ అవుతుందిలే అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒప్పుకున్న ప్రాజెక్టులలో ‘ఓజీ’ (OG) ఒకటి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, శ్రయా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనిని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వ ర్తిస్తుండగా.. ఈ సినిమాతో పాటు మిగిలిన మూవీస్ షూటింగ్ కూడా వాయిదా పడింది. అయితే.. మళ్లీ ఆయన షూటింగ్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుండగా.. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు చిత్ర బృందం.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న రిలీజ్ డేట్ రావడంతో పాటు.. మరో బిగ్ షాక్ కూడా తగిలింది. OGతో మరో స్టార్ హీరో సినిమా పోటీ పడనున్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్‌లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న శివ కార్తికేయన్ (Siva Karthikeyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మదరాసి’ (Madharasi). మురుగదాస్ (Murugadoss) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. శ్రీ లక్ష్మి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ కూడా సెప్టెంబర్ 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉండటంతో.. OG, మదరాసి సినిమాలకు మధ్య గట్టి పోటి ఉండబోతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ కావడంతో.. ‘ఈ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాయి.. అందులో నో డౌట్’ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే ‘OG రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందిలే’ అంటూ మరికొందరు రిప్లైలు ఇస్తున్నారు.



Next Story

Most Viewed