- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sivakarthikeyan: వరుస ప్రాజెక్టులు లైన్‌లో పెడుతోన్న హీరో.. ఆనందంలో ఫ్యాన్స్
‘అమరన్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan).

దిశ, సినిమా: ‘అమరన్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan). ప్రస్తుతం ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందిస్తు్న్నాడు. ప్రజెంట్ శివకార్తికేయన్ చేతిలో ఉన్న వరుస ప్రాజెక్టులలో ‘మదరాసి’ (Madrasi) ఒకటి. ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని శ్రీ లక్ష్మీ మూవీస్ రూపొందిస్తుంది. విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బిజు మీనన్, షబీర్, విక్రాంత్, విద్యుత్ జామ్వాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు & హిందీ భాషలలో థియేటర్లలో విడుదల కానుంది విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మరో ప్రాజెక్ట్ లైన్‌లో పెట్టాడట శివకార్తికేయన్. ఇది సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోందని తెలుస్తుండగా.. దీనికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడట. ఇక ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతుండగా.. అక్టోబర్ నెల నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు టాక్. ఇక ఈ సినిమాకు కూడా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లింక్






