హిట్ కాంబో రిపీట్.. ఆ స్టార్ హీరోతో మరోసారి జతకడుతోన్న శ్రీలీల!

by Chukka Sudharani |

శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటిస్తున్న పీరియాడికల్ డ్రామా ‘పరాశక్తి’.

హిట్ కాంబో రిపీట్.. ఆ స్టార్ హీరోతో మరోసారి జతకడుతోన్న శ్రీలీల!
X

దిశ, సినిమా: శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటిస్తున్న పీరియాడికల్ డ్రామా ‘పరాశక్తి’. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ప్రమోషనల్ కంటెంట్‌తో మరింతగా సినిమాపై పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇంకా ఈ సినిమా రిలీజ్ కాకముందే.. శివకార్తికేయన్, శ్రీలీల మరోసారి జత కట్టేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శివకార్తికేయన్ దర్శకుడు సిబి చక్రవర్తితో తన ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నట్లు తెలుస్తుంది.

అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ షూటింగ్ డిసెంబర్ 10న చెన్నై శివారు ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా జరుగుతున్నాయని తెలుస్తుండగా.. ఈ సినిమాలో మొదటగా రష్మిక మందన్నను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. అయితే.. డేట్స్ కారణంగా రష్మిక తప్పుకోవడంతో.. ఇప్పుడు శ్రీలీల ఫైనల్ చేశారట మేకర్స్. ఇప్పటికే శ్రీలీల టీమ్‌లో జాయిన్ కాగా.. డిసెంబర్ చివరలో షెడ్యూల్ తర్వాత.. తదుపరి షెడ్యూల్ 2026 పొంగల్ తర్వాత ప్రారంభం కానుందట. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుండగా.. ఒకేసారి రెండు సినిమాలు చేయడం విశేషంగా మారింది.

Next Story