- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sivaji: మరోసారి వైల్డ్ క్యారెక్టర్‌తో వచ్చేస్తున్న శివాజీ.. సినిమా నుంచి పోస్టర్ రిలీజ్
సీనియర్ నటుడు శివాజీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

దిశ, సినిమా: సీనియర్ నటుడు శివాజీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తండ్రి పాత్రల్లోనే కాకుండా.. కోర్టు సినిమాతో విలన్‌గా కూడా మెప్పించిన ఈయన.. తన మల్టీ బాడీ లాంగ్వేజ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఇదే జోష్‌తో ఇప్పుడు ఆయన త్వరలో ‘దండోరా’ చిత్రంతో రాబోతున్నాడు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని లైక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నవదీప్, నందు, మణిక, అనూష, రాధ్య, బిందు మాధవి, రవికృష్ణతో పాటు శివాజీ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే.. నేడు శివాజీ పుట్టిన రోజు కావడంతో.. ఈ సందర్భంగా ‘దండోరా’ మూవీ నుంచి శివాజీ లుక్‌ను రిలీజ్ చేవారు చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో శివాజీ.. పల్లెటూరి వ్యక్తిలా కనిపిస్తూ పొలంలో ఉన్న గట్టుపై కూర్చిని కూల్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు.లింక్






