Kalyani Priyadarshan : హిట్ కాంబో రిపీట్.. మరోసారి ఆ స్టార్ హీరోతో జతకట్టబోతోన్న కళ్యాణి ప్రియదర్శన్

by Chukka Sudharani |

మలయాళ యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ‘హలో’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Kalyani Priyadarshan : హిట్ కాంబో రిపీట్.. మరోసారి ఆ స్టార్ హీరోతో జతకట్టబోతోన్న కళ్యాణి ప్రియదర్శన్
X

దిశ, సినిమా: మలయాళ యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ‘హలో’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక రీసెంట్‌గా లోకా: చాప్టర్ 1’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ప్రజెంట్ తమిళంలో వరుస చిత్రాలు ఓకే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రీసెంట్‌గా ‘జీని’ అనే కొత్త సినిమాను ప్రటిస్తూ కళ్యాణి పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా తమిళంలో మరో చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్‌గా మదరాసి మూవీతో హిట్ అందుకున్న కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ ప్రజెంట్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం సిద్ధం అవుతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా కళ్యాణి ప్రియదర్శిన్ ఫైనల్ చేశారట మేకర్స్. ఇప్పటికే శివ కార్తికేయన్, కళ్యాణి ప్రియదర్శిన్ కాంబోలో మూవీ వచ్చి హిట్ కావడంతో.. మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతున్నట్లు వార్తలు వస్తుండగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story