- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sitara: ‘రోమ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ సూపర్‌స్టార్ గారాలపట్టి పోస్ట్
సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అతి చిన్న వయస్సులోనే సూపర్‌స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార (Sitara) ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ పీఎంజే(Popular jewelry brand PMJ)కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. పీఎంజేకు ప్రమోషనల్ యాడ్‌లో ఫొటో షూట్ చేసి అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. న్యూయార్క్ (New York) నగరంలో టైమ్స్ స్క్వేర్‌లో సితార కలెక్షన్‌ను ఆవిష్కరించింది.
ఇంత చిన్న ఏజ్‌లో మహేష్ బాబు (Mahesh Babu)కుమార్తె పీఎంజేకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం సినీ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. అయితే పీఎంజీ జ్యువెలర్స్ మరో కొత్త బ్రాండ్ ఓపెన్ చేసింది. కాగా దీనికి బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassador) అయిన సితార ఘట్టమనేని ఈ షాప్ ఓపెనింగ్‌కు హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. సితార ఈ షాప్ ఓపెనింగ్‌కు హాజరైన పలు ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
సితారకు ఈ వయస్సులోనే హీరోయిన్ లెవల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. నెట్టింట ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో లక్షల వ్యూస్, లైకులు రావాల్సిందే. ఇకపోతే ఈమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. తల్లి నమ్రత శిరోద్కర్‌తో కలిసి రోమ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్ కు సితార ‘రోమ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఘట్టమనేని గారాలపట్టి లేటెస్ట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






