Sitara: ‘పంజాగుట్టలో అతిపెద్ద స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైనందుకు సంతోషంగా ఉంది’.. ఆకట్టుకుంటోన్న సితార పోస్ట్

by Kodari Anjali |   (  Updated:2025-04-08 09:28:49  IST  )

అతి చిన్న వయస్సులోనే సూపర్‌స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార (Sitara) ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ పీఎంజేకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.

Sitara: ‘పంజాగుట్టలో అతిపెద్ద స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైనందుకు సంతోషంగా ఉంది’.. ఆకట్టుకుంటోన్న సితార పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అతి చిన్న వయస్సులోనే సూపర్‌స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార (Sitara) ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ పీఎంజే(Popular jewelry brand PMJ)కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. పీఎంజేకు ప్రమోషనల్ యాడ్‌లో ఫొటో షూట్ చేసి అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. న్యూయార్క్ (New York) నగరంలో టైమ్స్ స్క్వేర్‌లో సితార కలెక్షన్‌ను ఆవిష్కరించింది. ఇంత చిన్న ఏజ్‌లో మహేష్ బాబు (Mahesh Babu)కుమార్తె పీఎంజేకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం సినీ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది.

అయితే పీఎంజీ జ్యువెలర్స్‌ మరో కొత్త బ్రాండ్ ఓపెన్ చేసింది. కాగా దీనికి బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassador) అయిన సితార ఘట్టమనేని ఈ షాప్ ఓపెనింగ్‌కు హాజరైంది. అయితే సితార ఈ షాప్ ఓపెనింగ్‌కు హాజరైన పలు ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోలకు ఘట్టమనేని గారాల పట్టి.. ‘‘పంజాగుట్టలో @pmj_jewels అతిపెద్ద స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైనందుకు సంతోషంగా ఉంది. సంప్రదాయం, కాలాతీత అందాల వేడుక సితార హాఫ్ చీర కలెక్షన్‌ను ఆవిష్కరించినందుకు చాలా ఉత్సాహంగా ఉంది. మీరందరూ దీన్ని చూడటానికి వేచి ఉండలేను’’ అంటూ రాసుకొచ్చింది.

Next Story