- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీరలో సితార.. ఏముంది మామ.. ఫొటోలు వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ గారాల పట్టి సితార ఈ మధ్యే టీనేజ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విష్ చేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించాడు ప్రిన్స్. అయితే సినిమాల్లోకి అడుగుపెట్టక ముందే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ గారాల పట్టి సితార ఈ మధ్యే టీనేజ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విష్ చేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించాడు ప్రిన్స్. అయితే సినిమాల్లోకి అడుగుపెట్టక ముందే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఘట్టమనేని వారసురాలు.. ఇప్పటికే జ్యువెల్లరీ యాడ్ కూడా చేసింది. తండ్రితో రిలయన్స్, ఫ్యామిలీతో రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ చేసి మెప్పించింది. అందం, అభినయం, గౌరవమర్యాదల్లో తండ్రికి తగ్గ కూతురిగా ప్రశంసలు అందుకుంది.
ఇదిలా ఉంటే టీనేజ్‌లోకి అడుగుపెట్టినట్లు తండ్రి ప్రకటించడంతో.. ఇప్పటి వరకు మోడ్రన్, లెహంగాలో చూసిన నెటిజన్లు.. చీరలో చూడాలనుకున్నట్లు ఉన్నారు. ఈ క్రమంలో ఓ హీరోయిన్ ఫొటోలను తీసుకుని సితార ముఖంతో ఎడిట్ చేశారు. ఎలాగంటే అచ్చం సితారే చీర కట్టుకున్నదా అన్నంత యాప్టెడ్‌గా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతుండగా.. ఏముంది మామ సితార పాప.. అచ్చం దేవకన్య మాదిరిగానే ఉంది కదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అభిమానులు ఆమెకు దిష్టి తగలకుండా ఉండాలని కోరుకుంటున్నారు.






