Sitara: ఉగాది పండుగ సందర్భంగా కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న సితార.. ఆకట్టుకుంటోన్న ఆఫ్ శారీ పిక్స్

by Kodari Anjali |   (  Updated:2025-03-30 12:06:40  IST  )

తెలుగు రాష్ట్రాల ప్రజలు నేడు (మార్చి 30) ఉగాది పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Sitara: ఉగాది పండుగ సందర్భంగా కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న సితార.. ఆకట్టుకుంటోన్న ఆఫ్ శారీ పిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలు నేడు (మార్చి 30) ఉగాది (Ugadi) పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో జనాలు తమ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చి అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వరుస పోస్టులతో అభిమానుల్ని అలరిస్తున్నారు.

ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) కుమార్తె సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. బేబీ పింక్ కలర్ లంగావోణి వేసుకుని అదిరిపోయే ఫొటోలకు ఫోజులిచ్చింది. చెవులకు జుంకాలు, మెడలో నెక్లెస్, పాపటబిల్లా అన్ని ధరించి.. కుందనపు బొమ్మలా ఉందనడంలో అతిశయోక్తిలేదు. సంప్రదాయ లుక్‌లో ఆకట్టుకుంటోన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలకు సితార ఘట్టమనేని అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని రాసుకొచ్చింది. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు గారాల పట్టి ఉగాది స్పెషల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ ఏజ్ లోనే హీరోయిన్ లెవల్‌లో అభిమానుల్ని సొంతం చేసుకుంది. సితార ఏ పోస్ట్ పెట్టినా.. క్షణాల్లో లక్షల వ్యూస్ వస్తా యి.

Next Story