- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sitara Ghattamaneni: ఆష్టన్‌ను పరిచయం చేసిన సితార ఘట్టమనేని.. బ్యూటిపుల్ పిక్స్ వైరల్
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu)గారాల పట్టి సితార(Sitara) గురించి స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu)గారాల పట్టి సితార(Sitara) గురించి స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన అక్కర్లేదు. అ అమ్మడు తరచూ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. వెకేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, తన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది.
సితారకు ఈ వయస్సులోనే హీరోయిన్ లెవల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడం నిజంగా గమనార్హమని చెప్పుకోవచ్చు. తండ్రికి తగ్గ కూతురిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంటుంది. సితార ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో తండ్రితో కలిసి ఓ పాటకు దుమ్ము లేచిపోయే స్టెప్పులు వేసింది.
సితార ఘట్టమనేని ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్ పీఎంజేకి (Popular jewelry brand PMJ)బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తుంది. పీఎంజే ప్రమోషనల్ యాడ్‌లో ఫోటో షూట్ చేసి జనాల్ని ఆకట్టుకుంది. న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో సితార కలెక్షన్‌ను ఆవిష్కరించింది. సితార బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం టాక్ ఆఫ్ టాలీవుడ్‌గా మారింది. సూపర్ స్టార్ గారాల పట్టి అతి పెద్ద యాడ్ కాంట్రాక్ట్‌కు సైన్ చేసి, ఇలాంటి అరుదైన రేర్ ఫీట్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ స్టార్ కిడ్‌గా సితార నిలిచింది.
ఇటీవలే ఈ అమ్మడు ఓ ఈవెంట్‌లో తల్లి నమ్రతతో కలిసి బ్యూటీఫుల్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలు నమ్రత సోషల్ మీడియా వేదికన అభిమానులతో పంచుకుంది. లెహంగా మోడల్ స్టైలిష్ డ్రెస్.. సితార సింపుల్ లుక్ పార్టీలో అందరినీ ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా సితార ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌లో కుక్క పిల్లలతో ఉన్న ఫొటోలను పంచుకుంది. ఈ పిక్స్‌కు ‘‘ఆష్టన్‌ను పరిచయం చేస్తున్నాను’’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఘట్టమనేని గారాల పట్టి పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.






