Mohammed Siraj : వైరల్ అవుతున్న సిరాజ్ డేటింగ్ కహానీ!

by Muthe.Rajitha |   (  Updated:2025-01-31 16:30:57  IST  )

టీంఇండియా ఆల్ రౌండర్ మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) డేటింగ్ వార్తలతో మరోసారి నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాడు.

Mohammed Siraj : వైరల్ అవుతున్న సిరాజ్ డేటింగ్ కహానీ!
X

దిశ, వెబ్ డెస్క్ : టీంఇండియా ఆల్ రౌండర్ మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) డేటింగ్ వార్తలతో మరోసారి నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాడు. టీంఇండియా క్రికెటర్లకు సినీ తారలకు విడదీయని బంధాలే ఉంటాయి. చాలామంది క్రికెటర్స్.. ఇండస్ట్రీ స్టార్స్ తో లవ్ లో పడి వారిని పెళ్లి చేసుకున్నారు. అందుకే పలువురు క్రికెటర్లు, హీరోయిన్లు ఎక్కడ కలిసి కనిపించినా వారి మధ్య ఏదో ఉందన్న వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడం ఖాయం. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ మహమ్మద్ సిరాజ్ ఓ స్టార్ నటితో ప్రేమలో ఉన్నట్టు సినీ లోకం కోడై కూస్తోంది. ఇటీవలే బాలీవుడ్‌ సింగర్‌ జనై భోస్లే(Singer Zanai Bhosle)తో రిలేషన్‌ వార్తలు రాగా.. తనకు సోదరిలాంటిదని సిరాజ్‌ క్లారిటీ ఇచ్చి ఆ గాసిప్స్ కు చెక్ పెట్టాడు. తాజాగా బిగ్‌బాస్‌-13(BigBoss -13) ఫేమ్‌ మహిరా శర్మ(Mahira Sharma)తో డేటింగ్‌లో ఉన్నారని.. ఈ విషయాన్ని సిరాజ్‌, మహిరా సన్నిహితులు ధ్రువీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే, వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు.

సోషల్‌ మీడియాలోనూ ఒకరినొకరు ఫాలో అవుతుండడంతో పాటు ఫొటోలను లైక్‌ చేయడంతో పాటు కామెంట్స్‌ చేశారు. దాంతో వీరి మధ్య సమ్‌ థింగ్‌ సమ్‌ థింగ్‌ జరుగుతుందంటూ రూమర్స్‌ మొదలయ్యాయి. హైదరాబాదీ బౌలర్‌ టీమిండియా జాతీయ జట్టుతో రాణిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటించిన విషయం తెలిసిందే. మహిరా శర్మ హిందీ, పంజాబీ టెలివిజన్‌ షోలో నటించింది. జమ్మూ నుంచి ఇండస్ట్రీకి వచ్చింది. బిగ్‌బాస్‌-13 సీజన్‌లో పాల్గొని పాపులారిటీ సాధించింది. ఇదిలా ఉంటే సిరాజ్‌-మహిరా డేటింగ్‌ వార్తలపై ఆమె తల్లి సానియా శర్మ ఫైర్ అయింది. అసలు మీరేం మాట్లాడుతున్నారు.. బయటి వ్యక్తులు ఏవో చెబుతుంటారని అంటూ మీడియాపై మండిపడింది. తన కూతురు ఓ సెలబ్రిటీ అని.. అభిమానులు ఆమెకు ఎవరితోనో సంబంధాలు అంటగడుతుంటారని.. వాటిని నమ్ముతారా? అవన్నీ అవాస్తవంటూ ఆమె కొట్టిపడేశారు.

Next Story