- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవిష్ణు "సింగిల్" ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన సింగిల్ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన సింగిల్ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడీగా ఇవానా, కేతిక శర్మ నటించారు. గీతా ఆర్ట్స్ మరియు కల్యా ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. కార్తిక్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ట్రైలర్ విషయానికి వస్తే..ఆద్యంతం వినోదాత్మకంగా నవ్వులు పూయించేలా ఉంది. టైటిల్ సింగిల్ అయినప్పటికీ హీరో ఇద్దరు భామలతో పులిహోర కలుపుతూ చివరికి వారి మధ్య నలిగిపోయినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ సైతం కీలక పాత్రలో నటించగా తన కామెడీ టైమింగ్‌తో రెచ్చిపోయారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక శ్రీవిష్ణు హీరోగా వచ్చిన సామజవరగమన సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సింగిల్ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.






