- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Singer Sunitha : ప్రవస్తి ఆరోపణలపై సునీత షాకింగ్ రియాక్షన్
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలు(Singer Pravasthi Alleged) పెను దూమరాన్ని రేపుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలు(Singer Pravasthi Alleged) పెను దూమరాన్ని రేపుతున్నాయి. ఓ ఛానెల్ నిర్వహిస్తున్న పాటల పోటీల్లోని న్యాయ నిర్ణేతలు సింగర్ సునీత(Singer Sunitha), సంగీత దర్శకుడు కీరవాణి(Music Director Keeravani), గేయ రచయిత చంద్రబోస్(Lyricist Chandrabose) తనపై తీవ్ర వివక్ష చూపించారని ప్రవస్తి ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా టీవీల్లో ప్రసారం అవుతున్న పలు టాలెంట్ షోలపై నెట్టింట్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా ప్రవస్తి చేసిన ఆరోపణలను గాయని సునీత ఖండించారు. తనను తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధగా ఉందన్న సునీత.. టాలెంట్ షోలు ఎలా నిర్వహిస్తారో తెలిసి కూడా ఇలాంటి నిందలు వేయడం దారుణం అన్నారు.
ప్రవస్తిని చిన్నప్పుడు ముద్దు చేసినట్టు ప్రస్తుతం చేయలేనని.. పాటల విషయంలో ఛానెల్స్ కు హక్కులు ఉన్నవి మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని, అందులో తమ నిర్ణయం ఏమీ ఉండదని తెలిపారు. ఆడియన్స్ కు అన్ని విషయాలు చెబితే అప్పుడు సంతోషిస్తాను గాని, ఇలా తనకు కావాల్సినవి మాత్రమే చెప్పుకొని సింపతీ పొందాలని చూడటం సరికాదని సునీత పేర్కొన్నారు.






