- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎమోషనల్ నోట్
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. రాహుల్ సిప్లిగంజ్ తెలుగు సినిమా పాటల, జానపద పాటల గాయకుడు. తెలంగాణ యాసలో మగజాతి అనే జానపద పాటతో యూట్యూబ్ లో ప్రాచూర్యం పొందిన రాహుల్, 2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడ పాటతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత రాహుల్ సిప్లిగంజ్ కాల భైరవ కలిసి పాడిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని '‘నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. అయితే తాజాగా ఈ సింగల్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
‘‘ ప్రియమైన ప్రేక్షకులారా.. నిన్న (జూన్ 7వ తేదీ) బౌల్డర్ హిల్స్‌లో ప్రదర్శన ఇవ్వలేకపోయినందుకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. నిర్వాహకులు అండ్ పోలీసుల వైపు నుండి చివరి నిమిషంలో అనుమతి సమస్యల కారణంగా, నన్ను వేదికపైకి అనుమతించలేదు. ఇంత ఉత్సాహం, సన్నాహాలు చేసిన తర్వాత కూడా ఈ అవకాశాన్ని కోల్పోవడం నిజంగా నా హృదయాన్ని బాధపెడుతుంది. మీ ప్రేమ.. అలాగే మీ మద్దతు నాకు ప్రపంచం లాంటిది. నేను దానిని మీకు త్వరలోనే తిరిగి ఇస్తానని హామీ ఇస్తున్నాను’’. అంటూ రాసుకొచ్చారు.






