3800 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు.. సింగర్ గిన్నిస్ రికార్డ్

by Sujitha Rachapalli |

బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ పలక్ ముచల్ గొప్ప మనసు చాటుకుంది. పలక్ - పలాష్ హార్ట్ ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించింది. వారి ప్రాణాలను నిలబెట్టింది

3800 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు.. సింగర్ గిన్నిస్ రికార్డ్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ పలక్ ముచల్ గొప్ప మనసు చాటుకుంది. పలక్ - పలాష్ హార్ట్ ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించింది. వారి ప్రాణాలను నిలబెట్టింది. ఇప్పటికి దాదాపు 3800 కంటే ఎక్కువ ఆపరేషన్లు చేయించిన పలక్.. గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఆపరేషన్లకు నిధులు సమకూర్చేందుకు లైవ్ కన్సర్ట్ చేసే పలక్.. చికిత్స పొందేందుకు ఆర్థిక సామర్థ్యం లేని వారిని ఆదుకుంటుంది. ఇక ఇదే విషయంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ స్థానం పొందింది సింగర్. ఇందుకు సంబంధించిన విషయం వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె ఇతరులకు స్ఫూర్తి నింపడంలో ముందుందని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story