- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో మరో విషాదం..ఎస్.జానకి కుమారుడు కన్నుమూత
లెజెండరీ సింగర్ ఎస్. జానకి కుమారుడు మృతి చెందారు. జానకి కుమారుడు మురళీకృష్ణ ఇవాళ వేకువ జామున మరణించినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రకరకాల కారణాల వల్ల సినీ ప్రముఖులు మరణిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ సింగర్ ఎస్. జానకి కుమారుడు మృతి చెందారు. జానకి కుమారుడు మురళీకృష్ణ ఇవాళ వేకువ జామున మరణించినట్లు తెలుస్తోంది. 65 సంవత్సరాలు ఉన్న మురళీకృష్ణ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారట.
ఇక ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. ఇక ఈ విషయాన్ని ప్రముఖ గాయని చిత్ర సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మురళీకృష్ణ మరణ వార్తతో ఉలిక్కిపడ్డట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు చిత్ర. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న మురళీకృష్ణ... చాలా సినిమాల్లో నటించి అందరినీ మెప్పించారు. ఇక ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. మురళీకృష్ణ మృతి నేపథ్యంలో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.






