మీరు నుంచి నువ్వుకి, ఒరేయ్ ఒసేయ్ నుంచ బుజ్జికి.. ప్రపోజల్ సీక్రెట్ బయటపెట్టిన టాలీవుడ్ సింగర్

by Naga Rani Yarlagadda |

టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో గీతామాధురి అంటే తెలియనివారు ఉండరు.

మీరు నుంచి నువ్వుకి, ఒరేయ్ ఒసేయ్ నుంచ బుజ్జికి.. ప్రపోజల్ సీక్రెట్ బయటపెట్టిన టాలీవుడ్ సింగర్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో గీతామాధురి అంటే తెలియనివారు ఉండరు. ఎన్నో సెన్సేషన్ సాంగ్స్ పాడి ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక నందూతో ఆమె పెళ్లి, పిల్లలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తమ ప్రపోజల్ సీక్రెట్ గురించి గీతా మాధురి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. గీతామాధురి భర్త నందు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.

గీతామాధురి - నందు జంట టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో ఒకరిగా నిలిచారు. తమ ప్రేమ, ప్రపోజల్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ పరిచయం ముందు ఫ్రెండ్స్ గా స్టార్ట్ అయినట్లు చెప్పారు. ముందుగా నందుకు తనే ప్రపోజ్ చేసినట్లు తెలిపారు. ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ చెప్పడం కాదని, ఇద్దరి మైండ్ సెట్ మ్యాచ్ అవుతుందని చెప్పినట్లు పేర్కొన్నారు. నిదానంగా తమ మధ్య పరిచయం మీరు నుంచి నువ్వు వరకూ పెరిగిందని, ఆ తర్వాత ఒసేయ్, ఒరేయ్ వరకు, ఆపై ఏంటి బుజ్జికి వచ్చిందన్నారు. అలా ఇద్దరి మైండ్స్, మనసులు కలిశాయన్నారు.

2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంటకు ఒక పాప, బాబు ఉన్నారు. గీతామాధురి సింగర్ గా సెటిలవ్వగా.. నందు యాంకర్ గా, యాక్టర్ గా రాణిస్తున్నాడు. ప్రస్తుతం నందు నటించిన సైక్ సిద్ధార్థ్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.

Next Story