ద్రౌపది -2పై చిన్మయి షాకింగ్ కామెంట్స్.. డైరెక్టర్ రియాక్షన్ ఇది

by Naga Rani Yarlagadda |

రిచర్డ్ రిషి హీరోగా.. సోల చక్రవర్తి నిర్మాతగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ద్రౌపది -2.

ద్రౌపది -2పై చిన్మయి షాకింగ్ కామెంట్స్.. డైరెక్టర్ రియాక్షన్ ఇది
X

దిశ, వెబ్‌డెస్క్: రిచర్డ్ రిషి హీరోగా.. సోల చక్రవర్తి నిర్మాతగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ద్రౌపది -2. ఇటీవలే ఈ సినిమా నుంచి నెలరాజె అనే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే.. సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న వివాహం సీన్ కు చిన్మయి శ్రీపాద పాడిన పాటపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రికార్డింగ్ సమయంలో పాట గురించిన నేపథ్యం సింగర్ కు తెలియకపోయినందుకే పాటపై చిన్మయి అలాంటి వ్యాఖ్యలు చేసిందని డైరెక్టర్ మెహన్ .జి తెలిపారు. ముందే తెలుసుకుని ఉంటే తాను ఇందులో ఇన్ వాల్వ్ అయ్యేదాన్ని కాదని చిన్మయి పేర్కొన్నారు.

ఈ పాట పాడేందుకు చిన్మయి స్వరమైతే బాగుంటుందని తానే చిన్మయిని పాడేందుకు ఒప్పించినట్లు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ ఆ సమయంలో అందుబాటులో లేకపోవవడంతో ట్రాక్ కు సంబంధించిన విషయాలను మాత్రమే చెప్పానన్నారు. కానీ పాటకు సంబంధించిన భావజాలాన్ని తెలుసుకోకుండానే చిన్మయి ట్వీట్ చేయడం సరికాదన్నారు. వెంటనే ఆమె ట్వీట్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. చిన్మయి ఇంటిపేరులోనూ శ్రీపాద అని ఉందని, ఇది ఆధ్యాత్మిక భావాన్ని తెలియజేస్తుందన్నరరు. మరి ఆమె ఏ భావజాల భేదాల గురించి విమర్శించారో తనకు స్పష్టంగా తెలియలేదని డైరెక్టర్ పేర్కొన్నారు.

Next Story