డ్యూడ్ దర్శకుడితో శింబు.. రంగంలోకి టాలీవుడ్ టాప్ బ్యానర్

by Pulgam srinivas |   (  Updated:2026-05-04 12:51:08  IST  )

డ్యూడ్ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన కీర్తిశ్వరన్ దర్శకత్వంలో శింబు తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు.

డ్యూడ్ దర్శకుడితో శింబు.. రంగంలోకి టాలీవుడ్ టాప్ బ్యానర్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ నటుడు శింబు (సిలంబరసన్ టీఆర్) ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆరాసన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే, ఆయన మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డ్యూడ్ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన కీర్తిశ్వరన్ దర్శకత్వంలో శింబు తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. అయితే ఈ సినిమాకు ఇంకా అధికారిక టైటిల్ ప్రకటించలేదు. ప్రస్తుతం ‘STR 52’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు హీరో, దర్శకుడు, నిర్మాణ సంస్థ వివరాలు తప్పితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇతర అప్డేట్స్ బయటకు రాలేదు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశముంది.

ఒకే కులం కావడంతో శ్రీదేవిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు.. రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్ వైరల్

Next Story