ఒకే కులం కావడంతో శ్రీదేవిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు.. రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |

జీవితతో పెళ్లికి ముందు అలనాటి అందాల తారా శ్రీదేవికి, తనకు మధ్య పెళ్లి ప్రపోజల్ వచ్చిందని హీరో రాజశేఖర్ తెలిపారు.

ఒకే కులం కావడంతో శ్రీదేవిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు.. రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: ఒకప్పుడు టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్‌గా ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్న సీనియర్ నటుడు రాజశేఖర్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి రీజెంట్‌గా ‘బైకర్’ చింత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీంతో ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఈయన తన లవ్, మ్యారేజ్ లైఫ్‌కు సంబంధించి ఆసక్తిక విషయాలు పంచుకున్నారు. ఈ హీరో నటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. వీరి పెళ్లికి ముందు అలనాటి అందాల తారా శ్రీదేవికి, తనకు మధ్య పెళ్లి ప్రపోజల్ వచ్చిందంటూ తెలిపాడు. తన పెళ్లి గురించి ఇంట్లో మాటలు జరుగుతున్న క్రమంలో మొదట హీరోయిన్ శ్రీదేవి సంబంధం వచ్చిందట. ఇద్దరిదీ ఒకే కులం కావడంతో శ్రీదేవినే పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు కూడా పట్టుబట్టారని తెలిపారు. అయితే ఇదే విషయాన్ని వెళ్లి జీవితకు చెప్పగా.. ‘మీరు వేరే పెళ్లి చేసుకుంటే మీ ఇష్టం, కానీ నేను మాత్రం జీవితాంతం సింగిల్‌గానే ఉండిపోతాను’ అని జీవిత తెలిపిందట. ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అయినట్లు చెప్పుకొచ్చాడు రాజశేఖర్. ప్రజెంట్ ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story