- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Silk Smitha : సిల్క్ స్మిత ఏఐ వీడియో వైరల్ !
సిల్క్ స్మిత సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన తెలుగు నటి..అంతేకాదు..తన అందం..మత్తెక్కించే నిషా కళ్లు..హస్కీ వాయిస్..ఐటమ్ సాంగ్ లతో..డ్యాన్స్ లతో సినీ అభిమానులను..ముఖ్యంగా కుర్రకారుకు కలల రాణిగా నిలిచిన తారగా సిల్క్ స్మిత తనదైన ముద్ర వేశారు.

దిశ, వెడ్ డెస్క్ : సిల్క్ స్మిత సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన తెలుగు నటి..అంతేకాదు..తన అందం..మత్తెక్కించే నిషా కళ్లు..హస్కీ వాయిస్..ఐటమ్ సాంగ్ లతో..డ్యాన్స్ లతో సినీ అభిమానులను..ముఖ్యంగా కుర్రకారుకు కలల రాణిగా నిలిచిన తారగా సిల్క్ స్మిత తనదైన ముద్ర వేశారు. దక్షిణాది సినీ పరిశ్రమలో ఎంతో పాపులర్ స్టార్ గా ఎదిగి..అంతే స్థాయిలో ఇండస్ట్తీలో ఆటుపోట్లు ఎదుర్కొని..చివరకు జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్న ఈ శృంగార తార బయోగ్రఫీ సినిమా కూడా ఓ సంచలనమే.
అయితే తాజాగా సిల్క్ స్మిత పై ఏఐ(AI) జనరేటెడ్ వీడియో ఆమెను నాటి తరంతో పాటు నేటి తరానికి కూడా అమె ఎంతటి అద్భుత అందాల నటి అన్నదానికి నిదర్శనంగా ఉంది. ఏఐ జనరేటేడ్ వీడియోలో సిల్క్ స్మితను నేటీ ఫ్యాషన్, సినీ ట్రెండ్ కు అనుగుణంగా ఆమె కాస్టుమ్స్ ను, ఆహార్యాన్ని తీర్చిదిద్ది పలు పాత్రల వేషధారణతో ఎంతో అద్భుతంగా తయారు చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సహా అనేక పాత్రల వేషధారణలతో ..సూపర్ ఉమెన్ గా, బాక్సర్ గా..పలు రూపాల్లో సిల్క్ స్మిత అందాలను ఏఐ మరింత రెట్టింపు చేసింది. అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సిల్క్ స్మిత ఏఐ జనరేటెడ్ వీడియోను చూసి ఆనందించండి మరి అంటున్నారు నెటిజన్లు.






